15 July, 2026 | 5:23 AM

సర్కారు బండ్లకు షెడ్డు కరువు!

08-06-2024 02:50 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 7 (విజయక్రాంతి): ప్రజలకు చేరువలో ప్రభుత్వ అనే నినాదంతో గత ప్రభుత్వం సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని నిర్మించారు. దీంతో అన్ని ప్రభుత్వశాఖలు ఒకే చోట ఉంటే ప్రజలకు సరైన సేవలు అందుతాయ ని మంచి ఉద్దేశంతో రూ.కోట్లు వెచ్చించి సకల సదుపాయాలతో భవనాల నిర్మాణం చేశారు. కానీ, ఆయా కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది, కార్యాలయానికి వచ్చే వారి వాహనాలకు మాత్రం షెడ్డు లేకుండా చేశారు. దీంతో వారి వాహానాలు ఎండకు ఎండుతూ, వానక తడుస్తూ ఊసూరుమంటున్నాయి. మండుటెండలో కార్లు, ద్విచక్రవాహానాలు ఉంచడం వల్ల ఉన్న పెట్రోల్ ఆవిరై ఆర్థిక నష్ట కల్గిస్తోంది.  పెట్రో ల్ ధర చూస్తే మండిపోతుంది, దీనికితోడు మండు టెండలో ఉంచడంతో ఆవిరైపోతోందని ప్రతి అధికారితో పాటు, సిబ్బంది లబోదిబోమంటున్నారు. వివిధ పనులపై వచ్చిన ప్రజల వా హనాలు సైతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కనీసం చెట్టు నీడైనా ఉందా అది లేకపోవడంతో  తీవ్ర ఆవేధన వ్యక్త ంచేస్తున్నారు.  ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  కల్పించుకొని వాహనాలకు షెడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.