15 July, 2026 | 5:38 AM

పోడు కేసులపై గ్రామస్థుల ఆందోళన

08-06-2024 02:48 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 7 (విజయక్రాంతి) : కాగజ్‌నగర్ మండలం కడంబా గ్రామానికి చెందిన పోడురైతులను అడ్డుకొని ఐదుగురిపై అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. దీంతో గ్రామస్థు లు ఆందోళన చేపట్టారు. తమ భూములను అటవీశాఖ అధికారులు లాక్కుంటున్నారని ఆరోపించారు. అమాయకులపై కేసులు పెట్ట డం సరికాదని మండిపడ్డారు. గ్రామస్తుల నిరసనకు బీజేపీ రాష్ట్ర కన్వీనర్ కొంగ సత్యనారాయణ మద్దతు ప్రకటించారు. తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న వారిని అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. పోడు రైతులకు కోసం మరోసారి జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గుంట భూమిలేని జనార్థన్‌పై కూడా కేసు పెట్టడం కక్షసాధింపు చర్యలుగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. కేసులు వెంటనే ఎత్తివే యాలని డిమాండ్ చేశారు.