29 August, 2026 | 9:34 PM

తాళం వేసిన ‘డ్రగ్’ కార్యాలయం

29-08-2026 02:27 AM

అధికారుల తీరుపై ప్రశ్నలు

గద్వాల ఆగస్టు 28: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో ఉన్న జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పనిదినాల్లోనూ తాళం వేసి ఉండటం చర్చకు దారితీసింది. ప్రజలకు, మెడికల్ వ్యాపారులకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండాల్సిన కార్యాలయం మూసివుండటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? అధికారులు ఫీల్డ్లో ఉంటే కార్యాలయంలో సమాచారం ఎందుకు కనిపించదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.జిల్లాలోని మెడికల్ షాపుల తనిఖీలు, ఔషధాల విక్రయాలపై పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహించే శాఖ కార్యాలయమే ఇలా తాళం వేసి ఉండటంపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవ పరిస్థితిపై విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.