29 August, 2026 | 5:12 AM

కలెక్టర్‌కు రాఖీలు కట్టిన బాలసదనం చిన్నారులు

29-08-2026 02:26 AM

గద్వాల, ఆగస్టు 28: రాఖీ పౌర్ణమి సందర్భంగా బాలసదనం చిన్నారులు శుక్రవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులు చూపించిన ప్రేమ, ఆప్యాయత ఎంతో ఆనందాన్ని కలిగించాయని అన్నారు. బాలసదనం పిల్లలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీపీఓ నర్సింహులు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరి, పీఓఐసీ ఇన్చార్జి సురేష్ తదితరులు పాల్గొన్నారు.