calender_icon.png 15 February, 2026 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సరిహద్దులో మాదక ద్రవ్యాలు

15-02-2026 12:00:00 AM

డ్రోన్లు నేలమట్టం.. 40 కోట్ల హెరాయిన్ సీజ్

శ్రీనగర్, ఫిబ్రవరి 14: భారత్ -పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో శనివారం తెల్లవారుజామున బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), జమ్మూ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఏకంగా రూ.౪౦ కోట్ల విలువైన 6.5 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేశారు. స్మగ్లర్లు డ్రోన్లను వినియోగించి, డ్రగ్స్‌ను భారత్‌కు రవాణా చేస్తుండగా, బీఎస్‌ఎఫ్, పోలీసులు ఈ రవాణాకు అడ్డుకట్ట వేశారు.

జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్ నుంచి పాక్ స్మగ్లర్లు మాదక ద్రవ్యా లు రవాణా చేస్తున్నారని సమాచారం అందుకున్న బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జమ్మూ పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టారు. సరిహద్దు ప్రాం తంలో డ్రోన్ కదలికలను గుర్తించారు. చాకచక్యంగా వాటిని నేలమట్టం చేశారు. మేజిస్ట్రే ట్ సమక్షంలో డ్రోన్లకు కట్టిన ప్యాకెట్లను తెరిచి చూడగా, వాటిలో 6.5 కిలోల హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద, స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.