calender_icon.png 8 November, 2024 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబ్బాక ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

10-10-2024 12:36:36 AM

దుబ్బాక, అక్టోబర్ 9: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్‌లోని కొండపూర్‌లో గల తన నివాసంలో పోలీసులు బుధవారం హౌస్ అరెస్ట్ చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించేందు కు నియోజకవర్గానికి వెళ్తున్న తనను ఎందుకు ఆపుతున్నారని ఎమ్మెల్యే వారిని ప్రశ్నించారు. అనంతరం డీసీపీ జయరాంతో ఫోన్‌లో మాట్లాడారు. కనీసం మాదాపూర్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయానికి వెళ్లనివ్వాలంటూ తెలపడంతో అక్కడికి వెళ్లడానికి అవకాశం ఇచ్చారు. కానీ, అక్కడ ఆఫీస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాం డ్ చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు వెళ్తున్నారనే సమాచారంతో చేసినట్లు పోలీసులు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు.