calender_icon.png 6 December, 2024 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు అరెస్ట్

10-10-2024 12:35:16 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 9: ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ముచ్చింతల్ గ్రామానికి చెందిన నర్సింహ గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన స్థానిక జేబీఎం గార్డెన్స్ యాజమాన్యాన్ని గతంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దీంతో యాజమాన్యం కొంతమేర సొమ్ము ఇచ్చింది. నర్సింహ మళ్లీ యాజమాన్యాన్ని సొమ్ము అడిగాడు. అందుకు యాజమాన్యం నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. తాజాగా యాజమాన్యం పోలీసులను ఆశ్రయించడంతో బుధవారం  నర్సిం హను అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.