24-02-2026 12:00:00 AM
మహదేవపూర్ యువకుడి వినూత్న అభిమానం
మహదేవపూర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మహదేవపూర్కు చెందిన యువకుడు కాట్రేవుల నవీన్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పై తనకున్న అపారమైన అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తం చేస్తూ బియ్యం గింజలతో ప్రత్యేక చిత్రపటాన్ని రూపొందించారు. ఈ చిత్రపటం స్థానికంగా విశేష ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలను అందుకుంది. పాలతో అభిషేకం చేసినా, రక్తంతో బొమ్మ గీసినా, బియ్యం గింజలతో చిత్రం వేసినా అది తన హృదయంలో ఉన్న అపారమైన ప్రేమకు ప్రతీక మాత్రమేనని నవీన్ యాదవ్ పేర్కొన్నారు.
నా అంతం వరకు నా ప్రయాణం మీతోనే అంటూ ఆయన తన అభిమానం వ్యక్తం చేశారు.భారత జాతీయ కాంగ్రెస్ అనుబంధ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని నవీన్ యాదవ్ను అభినందించారు. బియ్యం గింజలతో రూపొందించిన ఈ వినూత్న చిత్రపటం మహదేవపూర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.