15 June, 2026 | 4:53 PM

ఆసిఫాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పర్యటన

15-06-2026 03:38 PM

డప్పు వాయిద్యాలు, నినాదాలతో ఘన స్వాగతం

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు, నినాదాలతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో స్వాగత ర్యాలీ నిర్వహించారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా మారింది.పర్యటనలో భాగంగా అంబేద్కర్, తెలంగాణ తల్లి, కుమ్రం భీం విగ్రహాలకు కవిత పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.

తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన పని చేస్తుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళలు, యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యూరియా కోసం యాప్ బుకింగ్ ను రద్దుచేసి నేరుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు సమస్యలు,గిరిజనేతరుల సమస్యలను ప్రస్తావించారు.జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నట్లు వివరించారు.