బాలగణేష్ యూత్ అన్నదానం
15-06-2026 03:35 PM
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ వద్ద డబ్బుసెట్ లైన్ బాలగణేష్ యూత్ అన్నదానం చేసింది. అమ్మ ఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్, టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో ఈ అన్నదానo నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున చేసిన ఈ అన్నదానం ఎందరో...ఆకలి తీర్చింది. బెల్లంపల్లి పట్టణంలో ఇప్పటి వరకూ 389వ వారాలకి కు ఈ అన్నదానం కార్యక్రమం చేరుకుంది. బాల గణేష్ యూత్ సభ్యులు (డబ్బు సట్ లైన్ రోడ్ నెం 4) బెల్లంపల్లి వారి సహాకారంతో జరిగిన అన్నదానo వల్ల యాచకులకు, నిరుపేదలకు, దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మంది ఈ అన్నదానాన్ని సద్వినియోగం చేసుకున్నారు.






