16 July, 2026 | 6:47 PM

గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి

04-09-2025 02:08 PM

ధన్వాడలో గణనాథుడికి ప్రత్యేక పూజలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు

మంథని, (విజయక్రాంతి):  గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని టిపిసిసి  ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(Duddilla Srinu Babu) అన్నారు. గురువారం కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో గణేష్ నవరాత్రులలో భాగంగా గణపతి దేవునికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా ముత్తారం మండలం కొర్లకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన గణనాధుని  శ్రీను బాబు దర్శించుకొని కాంగ్రెస్ నాయకులతో కలిసి  దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అ గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరికీ, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడి పంటలతో సమృద్ధిగా పండాలని, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.