కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
04-09-2025 02:05 PM
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన కామారెడ్డి జిల్లాలో(Kamareddy district) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశించనున్నారు. సీఎం వెంట మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) ఉన్నారు. లింగంపల్లి కుర్దులో వంతెనను రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం తాత్కాలిక మరమ్మతులు కాకుండా బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బురుగిద్దలో దెబ్బతిన్న పొలాలను ఆయన పరిశీలించారు. కామారెడ్డిలో రోడ్లు, జీఆర్ కాలనీని పరిశీలించనున్నారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ లో అధికారులకు తో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.






