04-09-2025 02:09:31 PM
కోదాడ: కోదాడ మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు లక్ష్మీపురంలో రూ.3 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నిధులు నుండి చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పనుల జాతరతో నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కార్య క్రమంలో మోడే సైది బాబు యాదవ్, జంగా కృష్ణయ్య యాదవ్, అలవాల కోటయ్య గౌడ్, ఒట్టికూట్టి సత్యనారాయణ గౌడ్ సోమపంగు శ్రీనివాస్, భూమా ఉపేందర్, హరీష్ యాదవ్, కొండలు యాదవ్, సత్య నారాయణ గౌడ్,వెంకటేశ్వర్లు,వేణు గౌడ్,మౌలానా, మీరా, తదితరులు పాల్గొన్నారు.