దసరా సెలవులు..ఎన్ని రోజులో తెలుసా..!
హైదరాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): విద్యార్థులకు గుడ్‌న్యూస్. దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో పాఠశాలలకు వరుసగా 13 రోజులపాటు సెలవులు రానున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. సెలవుల అనంతరం అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 9వ తేదీ చివరి పనిదినంగా ఉండనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ షెడ్యూల్‌ను అమలు చేయాల్సి ఉంటుంది.
అక్టోబర్ 1 నుంచి SA-1 పరీక్షలు
దసరా సెలవులకు ముందు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. పరీక్షలు పూర్తయిన అనంతరం విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
బతుకమ్మ, దసరా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అక్టోబర్ 11 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానుండగా, సద్దుల బతుకమ్మను అక్టోబర్ 19న నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రముఖ ఆలయాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.
వరుసగా 13 రోజులపాటు సెలవులు రావడంతో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అవకాశం లభించనుంది. దీంతో చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది.