18 May, 2026 | 11:05 AM

ఉత్సాహంగా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్

18-05-2026 12:37 AM

హైదరాబాద్, మే 17 : స్కూల్ స్థాయిలోనే యువ స్విమ్మర్లను ప్రోత్సహించేందుకు 7హెచ్ స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న 4వ స్వి మ్మింగ్ ఛాంపియన్‌షిప్ ఉత్సాహంగా ముగిసింది. అంబర్‌పేట్ స్మిమ్వింగ్ పూల్ వేదికగా బాలుర, బాలికల విభాగాల్లో 130 మందికి పైగా చిన్నారులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు.

సమ్మర్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా 2023 నుంచీ 7హెచ్ స్పోర్ట్స్ సంస్థ ఈ స్వి మ్మింగ్ పోటీలను నిర్వహిస్తోంది. గత మూ డు సీజన్ల తరహాలోనే ఈ సారి కూడా అద్భుతమైన స్పందన రావడంతో పోటీలు హోరా హోరీగా సాగాయి. అండర్ 8, అండర్ 10, అండర్ 14, అండర్ 17 కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. అండర్ 6 బాలుర 50 మీటర్ల ఫ్రీ స్టుల్ విభాగంలో కేశవ్ కృష్ణ, ప్రియాన్ష్ దాస్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. అండర్ 6 బాలికల ఫ్రీ స్టుల్ విభాగంలో విని రా సంబంగి అగ్రస్థానంలో నిలిచింది.

అండర్ 8 విభాగంలో నారాయణ కార్తికేయన్ చక్రవర్తి(తొలి స్థానం), విహాన్ సాయివింట(రెండో స్థానం), విశ్వక్ వేద్(మూడో స్థానం) నిలిచారు.అండర్ 8 బాలికల 50 మీ. ఫ్రీ స్టుల్ ఈవెంట్‌లో రాజేశ్వరి, జాహ్నవి, హరిణి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండర్ 10 బాలుర 50 మీ. ఫ్రీస్టుల్ విభాగంలో రియాన్ష్ కొప్పుల, మంచన తేజ్‌వర్థన్, పైడిపల్లి జాస్విన్‌రావు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. నేటి బాలలే రేపటి ఒలింపియన్లు అనే లక్ష్యంతో సమ్మర్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతీ ఏడాది అన్ని క్రీడల్లోనూ చిన్నారులను ప్రో త్సహించేందుకు పోటీలు నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందని 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండ ర్ వెంకటేశ్ చెప్పారు. విజేతలకు ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్థన్‌రెడ్డి మెడ ల్స్ అందజేశారు.