calender_icon.png 1 November, 2024 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా సురేఖకు ఈసీ వార్నింగ్

27-04-2024 01:37:39 AM

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖను కేంద్ర ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఎన్నికల సమయం లో జాగ్రత్తగా వ్యవహరించా లని సూచించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 1న వరంగల్‌లో జరిగిన సభలో సురేఖ మాట్లాడు తూ.. కేటీఆర్ ఎంతోమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్‌మె యిల్ చేశారని, ఎందరో అధికారులను బలిచేసి వారి ఉద్యోగాలు కోల్పోయేలా చేశారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటం తోనే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చారు తప్ప.. రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నా ఏ నా డు కూడా బయటకు రాలేదని విమర్శించారు. అధికారం లేకనే కేసీఆర్, కేటీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌పై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఈసీ కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా నివేదిక తెప్పించుకుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ.. ప్ర త్యర్థులపై ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూ చించింది. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని హెచ్చరించింది.