5 May, 2026 | 6:17 PM

ఇంధన పునరుత్పాదకతపై రెన్యూఎక్స్ ఎగ్జిబిషన్

27-04-2024 01:36 AM

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ప్రముఖ బీ2బీ ఎగ్జిబి షన్ ఆర్గనైజర్ ఇన్ ఫార్మా మార్కె ట్స్ ఇన్ ఇండియా శుక్రవారం హెటెక్స్‌లో రెన్యూ ఎక్స్ 8వ ఎడిషన్‌ను విజయవంతంగా ఆవిష్కరిం చింది. పర్యావరణ అనుకూల హరి త విద్యుత్‌పై దృష్టి సారించి దక్షిణాది రాష్ట్రాల పునరుత్పాదక ఆవి ష్కరణను ప్రదర్శించేందుకు నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను 5 వేల మంది సందర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్కో సీఎండీ జానయ్య, తెలంగాణ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర సలహాదారు అజయ్ మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో రెన్యూ ఎక్స్ పునరుత్పాదక ఇంధనం కోసం ముఖ్య మైన ప్రదర్శనగా పేర్కొన్నారు.