13 March, 2026 | 7:13 AM

చదువుకే విద్యార్థి తలరాత మార్చే శక్తి

13-03-2026 12:47 AM

తల్లిదండ్రుల కలలు మీ చేతుల్లోనే : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, మార్చి 12 (విజయ క్రాంతి) : ఎంతటి పేద రికార్డుని అయిన చెదరగొట్టే శక్తి సామర్థ్యాలు కేవలం చదువుకు మాత్రమే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి ఆధునిక కాలంలో ప్రైవేటు వి ద్యాసంస్థల్లో పేద తల్లిదండ్రులైన ఎలాగో ఒకలా కష్టపడి చదివించాలని సంకల్పంతో అడుగులు వేస్తుండ్రు. ఆశక్తి సామర్ధ్యాలకు కూడా దూరంగా ఉండి ప్రభుత్వ పాఠశాలలోనే మా బిడ్డలు చదువు కొనసాగిస్తూ ఉన్నత శిఖరాలకు అధిరోహించే శక్తి భగవంతుడు ప్రసాదించాలని సంకల్పంతో ఎంతో మంది తల్లిదండ్రులు ఆశపడుతుండ్రు.

వారి ఆశలను పదును పెడుతూ విద్యార్థుల లక్ష్యాలకు నేనున్నానంటూ భరోసానిస్తూ మహ బూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల చదువుకు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. పాలమూరులో ఆరంభమైన  ఐఐఐటి కళాశాలలో సీటు సంపాదించాలని సంకల్పానికి నేనున్నానంటూ భరోసానిస్తూ ప్రత్యేక శిక్షణకు శ్రీకారం చుట్టి ర్యాంకులు సా ధించాలి ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని వారి లక్ష్యాలకు మరిం త చేయూతనిస్తూ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల అభినందనలు పొందడం విశేషం.

పుట్టిన ప్రతి బిడ్డ అసాధారణమైన వారే : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 పాలమూరు బిడ్డలు లేబర్ కాదని పు ట్టిన ప్రతి బిడ్డ అసాధారమైన వారిని ఆచర ణ వైపు అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టిస్తారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.  మహబూబ్నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సం యుక్త ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని వైటి సి బిల్డింగ్ లో గత 45 రోజుల పాటు  ఐఐఐటీ లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న 150 మంది  విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరం విజయవంతంగా పూర్తి చేశారు.

పాలమూరు అంటే కేవలం శ్రామిక జిల్లా  కాదని, ఎన్నో అన్యాయాలు, దగా, మోసాలకు గురైన జిల్లా అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పాలమూరు చరిత్ర ఒక ప్రధాన ఆధారమని, తెలంగాణ ఉద్యమంలో పాలమూరుకు జరిగిన అన్యాయం గురించి చెప్పి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు .  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త కూడా పాలమూరు జిల్లాకు పూర్తి న్యా యం  జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే యువత తెలంగాణ చరిత్రను కొత్తగా  రాసి భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. 

మనకు వనరులు లేవని  కేవలం మన పూర్వీకులు ఇచ్చిన జ్ఞానమే  మనకు ఉన్న ఏకైక ఆస్తి అన్నారు.  మన డిఎన్‌ఎలో ఉన్న మేధస్సు, తెలివి, కష్టపడే మనస్తత్వం, ప్రేమతో పలకరించే గుణాన్ని  మనం ఆయుధాలుగా చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.  ఈ శిబిరంలో పాల్గొన్న 150 మంది విద్యార్థులు తమ విజయాలతో తల్లిదండ్రులకు పేరుప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు.