విద్య విజ్ఞాన అభివృద్ధికి మూలం
నిర్మల్ మే 13 (విజయ క్రాంతి): విద్యని విజ్ఞాన అభివృద్ధికి మూలమని ప్రతి ఒక్కరు విద్యావంతుడై విజ్ఞానంతో సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులు ప్రారంభించారు.
నిర్మల్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విద్యార్థుల సంఖ్య పెంచుకొని మంచి ఫలితాలను అం దించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న సిపిఓ జీవరత్నం డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.






