ధాన్యం కొనుగోళ్లపై చిత్తశుద్ధి లేదు
నిర్మల్ మే 13 ( విజయక్రాంతి): రాష్ట్రం లో రైతులు పండించిన మొక్కజొన్న , వరి, జొన్న పంట కొనుగోళ్ల పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బిజెపి నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం సారంగపూర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలలో ప్రభుత్వం జాప్యం కారణంగా వర్షాలు పడితే తడిసిపోతున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు
ఉపకరణాల పంపిణీ
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 208 విద్యార్థులకు వివిధ ఉపకరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు






