10 July, 2026 | 1:55 PM

విద్యాసంస్థల బంద్ విజయవంతం

10-07-2026 01:19 PM

సంస్థాన్ నారాయణపూర్,జూలై 10(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తలపెట్టిన విద్యాసంస్థల బంద్ నారాయణపురం మండలంలో విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు వెలిజాల సాయిరాం ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలలను మూసివేసి నిరసన తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం,అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.పాఠశాలలు ప్రారంభమై నెల గడుస్తున్నా ఇప్పటికీ యూనిఫాం పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి కాలేదని అన్నారు.

కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు బోధించడానికి సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.సర్కారు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్న ప్రభుత్వం మాటలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని యెడల ఉద్యమం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి జినుకల సాయితేజ, మధు, చరణ్, మహేష్, ఎస్.కె గాలిబ్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.