10 July, 2026 | 12:37 PM

పరుగెత్తినా వెంటాడి.. మర్మాంగాలపై కొట్టి చంపిన స్నేహితులు

10-07-2026 12:01 PM

పెద్ద అంబర్ పేట యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు

పెద్ద అంబర్‌పేట్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో(Pedda Amberpet) యువకుడి హత్యకేసును పోలీసులు చేధించారు. ఈనెల 8న పసుమాములకు చెందిన సుహాస్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పెద్ద అంబర్ పేట శ్మశానవాటిక వద్ద సుహాస్ మృతదేహం గుర్తించారు.  సుహాన్ ఇంటికి వెళ్లి బయటకు తీసుకువచ్చి స్నేహితులే దారుణంగా కొట్టి చంపారని పోలీసులు తేల్చారు. సుహాస్ పరుగెత్తినా వెంటాడి.. తీవ్రంగా కొట్టి చంపినట్లు గుర్తించారు. మర్మాంగాలపై తీవ్రమైన గాయాలతో చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి. అనంతరం దుండగులు మృతదేహాన్ని రోడ్డు పక్కన సిమెంట్ దిమ్మెపై పడేసి పారిపోయారు.  యువతి వ్యవహారం, ఆర్థిక వివాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.