10 July, 2026 | 1:50 PM

ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కృషి

10-07-2026 01:17 PM
  1. పశుసంవర్ధక మంత్రి వాకిటి శ్రీహరి 
  2. గత పాలకులు ఇబ్రహీంపట్నం చేసింది ఏమీ లేదు: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
  3. మంత్రి వాకిటి శ్రీహరి నిరసన సెగ
  4. ఆందోళన చేపట్టిన మత్స్యశాఖ సంఘ సభ్యులు

అబ్దుల్లాపూర్ మెట్, జులై 10: కాంగ్రెస్ ప్రజాపాలనలు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామని పశుసంవర్ధక శాఖ, మత్సకార  మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) అన్నారు. జాతీయ మత్స రైతుల దినోత్సవం పురస్కరించుకొని.. మండల పరిధి కొహెడలో ఎగుమతి ఆధారిత హోల్ సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అంతర్జాతీయ చేపల మార్కెట్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి శ్రీహరి మాట్లాడుతూ...  కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి అతి చేరువలో మార్కెట్ నిర్మించుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. మార్కెట్ కు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాని అన్నారు.  మార్కెట్ నిర్మాణం కోసం రూ. 50 కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 50 కోట్లు అదనంగా కేటాయిస్తూ త్వరగా మార్కెట్ పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి దొరుకుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు. మార్కెట్ లో ప్రతిరోజు 10 టన్నుల చాపల ఉత్పత్తి అవుతాయన్నారు. ఒక ముదిరాజు బిడ్డగా ముదిరాజుల అభివృద్ధి కోసం సహాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.

10 ఏళ్లలో నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు 

 ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని  గత పాలకులు చేసింది శూన్యమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో  నియోజకవర్గానికి అంతర్జాతీయ మార్కెట్లతో కోహెడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కొ హెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి  రూ. 2300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత పాలకులు ప్రభుత్వ భూములను కొల్లగొట్టి కబ్జాలు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వంతోనే ఉండాలి.. లేక ప్రజల అభివృద్ధి కోసం అన్న కేటాయించాలి తప్ప.. బడా బాబులకు దారా దత్తం చేయొద్దని సూచించారు. కొ హెడ 13 ఎకరాలు.. రూ. 200  విలువచేసే భూమిని అంతర్జాతీయ చేపల మార్కెట్ కు కేటాయించినట్లు తెలిపారు.  ఇదే ప్రాంతంలో 

50 ఎకరాలలో పేదల ఇండ్ల ఇండ్ల నిర్మాణం కోసం  కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటాను అన్నారు.10 ఏండ్ల లో  గత పాలకులు చేసింది ఏమి లేదు గాని.. దోచుకున్నదే ఎక్కువ నాని అన్నారు. గత పాలకులు గుంజుకున్నా ప్రభుత్వ భూములను.. మేము లాక్కుని పేదలకు పంచుతామని అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో  చేప పిల్లలు పెంపకం పేరుతో... మట్టిని అమ్ముకున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మత్స్యశాఖ ఎండి నిఖిల, రంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డిపిఆర్ఓ బాలేశ్వరి, గడ్డి గన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కరాచారి, సింగారం సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి,  ఇబ్రహీంపట్నం ఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక తహసిల్దార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, పండుగల రాజు, పసుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి కి నిరసన సెగ

తెలంగాణ మత్స్యకారుల సంఘం నాయకుల ఆందోళన చేప రొయ్య పిల్లల కొనుగోలు కోసం  మత్స్య సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ ప్రతి మత్స్యకారుల సొసైటీకి అర్హులైన మత్యకారులందరికి టూ వీలర్ మరియు  ఫోర్ వీలర్ వెహికల్స్ 90% సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్. ఆందోళన కారులను అరెస్ట్ చేసిన పోలీసులు.