10 July, 2026 | 1:21 PM

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

10-07-2026 12:19 PM

మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్...

బాన్సువాడ, జూలై 10 (విజయ క్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో సింధు స్కూల్ దగ్గర ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కౌన్సిలర్ ఖాలేక్ కో ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్ సింధు స్కూల్ కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్ అనిల్  ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వార్డులో శుక్రవారం రోజున ఫ్రైడే డ్రైడే కార్యక్రమము చేసి పరిసరాలను ఉంచుకోవాలని వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని అన్నారు.13వ వార్డు కౌన్సిలర్ ఖాలేక్ మాట్లాడుతూ మున్సిపల్ మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమము జరిగినది ప్రజలందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇండ్లలో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని నిలువలు ఉంటే డెంగ్యూ విష జ్వరాలు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది అని అన్నారు. కోఆప్షన్ సభ్యులు గౌస్ మాట్లాడుతూ డ్రై డే ఫ్రైడే అందరు నిర్వహించి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మెడికల్ పవన్ ఏ వన్ ఫుట్వేర్ ఖదీర్ భాయ్ కిషోర్  అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.