19 March, 2026 | 1:19 PM

Breaking News

ఖతార్‌పై దాడి చేస్తే.. ఇరాన్‌లోని గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం   •   మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •  

బీజేపీ నాయకుల దిష్టిబొమ్మ దహనం

20-09-2024 09:56 PM

మందమర్రి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు తన్వీవిందర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల దిష్టి బొమ్మను దహనం చేశారు. శుక్రవారం పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం ఉపేందర్ మాట్లాడుతూ... బయటకు వస్తే రాహుల్ గాంధీని చంపేస్తామని, మీ నాన్న రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడిన మాటలను ఆయన  తీవ్రంగా ఖండించారు.

బీజీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీకు దేశ రాష్ట్ర ప్రజలు తగిన  బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, నాయకులు నేరువట్ల శ్రీనివాస్, ఎండి జమీల్, ఆకారం రమేష్,ఎండి ఆఫీస్,మంద తిరుమల్, బూడిద శంకర్, వడ్లూరి సునీల్,కుమార్ సట్ల సంతోష్,మంకు రమేష్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సోత్కో ఉదయ్,రాచర్ల గణేష్, వడ్లకొండ రంజిత్, రాజేష్, మెండ భాస్కర్, మాయ లింగయ్య,మొగిలి రమేష్, జీవన్,బాకం రవి, వీరు, మహేష్,తిరుపతి, కనకయ్య, శ్రీనివాస్,రాజు, మల్లేష్, సంజీవ్,రాకేష్, లు పాల్గొన్నారు