21 July, 2026 | 7:29 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి

21-07-2026 03:56 PM

విద్యార్థులపై లాఠీచార్జిని ఖండిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మ దగ్ధం

కొత్తగూడెం,(విజయక్రాంతి): జంతర్ మంతర్ ఢిల్లీలో నీట్ యూజీ-2026 పేపర్ లీకేజీ పై విద్యార్థులు,యువకులు వేలమంది రోడ్లెక్కి నిరసన తెలియజేస్తుంటే   ఎలాంటి హెచ్చరికలు లేకుండా నోటీసులు ఇవ్వకుండా సైనిక బలగాలు,పాలక తొత్తుల బలగాలు దాడులు చేసి వందలాది మంది విద్యార్థులను తీవ్రంగా గాయపరచడాన్ని ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ  పిలుపు మేర కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు.

జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరావు మాట్లాడుతూ... నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల లో   (2024-25-26) లో  89 సార్లు పేపర్ లీకులు,48 రీ-ఎగ్జాములు విద్యార్థులు రాయవలసి వచ్చింది. 2026 నీట్ ఎగ్జామ్ పేపరు రాజస్థాన్ దినేష్ బి వాల్, మంకీలాల్ బి వాల్,  బిజెపి  దగ్గర 30 లక్షలకి కొనుగోలు చేశారు.దీనితో 23 లక్షల మంది విద్యార్థులు మళ్ళీ రీ-ఎగ్జామ్ రాయవలసి వచ్చింది.20 మంది విద్యార్థులు బలవన్మరణం చేసుకున్నారు.

కష్టపడి రాత్రింబవళ్లు చదివి కన్న తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆశయసిద్ధితో లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకొని, డాక్టర్లు కావాలనుకున్న,విద్యార్థులకు నిరాశ మిగిలిందని ఆయన అన్నారు.ఒక్కసారిగా నీట్ 2026 పేపరు లీక్ కావడంతో,అనేకమంది విద్యార్థులు నిరాశ నిస్పృహతకు గురై గత 22 రోజులు ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల భవిష్యత్తు కోసం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ మద్దతుగా,అనేకమంది విద్యార్థులు రోడ్లెక్కి అర్ధరాత్రి ఢిల్లీ చేరుకొని అని పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది.

అలాంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేకమంది ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే విద్యార్థులపై లాఠీలు,టీయర్ గ్యాస్ లు,భారీ గేట్లతో తీవ్రంగా గాయపరిచారని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం అంటే దేశ భవిష్యత్తుతో ఆడుకోవటమేనని,నీట్ పేపర్ లీక్ చేసిన వారిని అరెస్టు చేశామని,కథనాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పిన,అసలు దోషులను బిజెపి నాయకులను అరెస్టు చేయలేదని అన్నారు. తక్షణమే బలవన్మరణం చేసుకున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఇవ్వాలని, సోనం వాంగ్ చుక్ కు ఎలాంటి ప్రాణహాని కేసులు లేకుండా చేయాలని, గాయపడిన వారికి చికిత్స అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజీ లు పునరావృతం కాకుండ, ప్రతిష్టమైన  చట్టాలను తీసుకురావాలని  అన్నారు.