21 July, 2026 | 9:20 PM

Breaking News

ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్   •   అఖిల్ హాస్పిటల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు కన్నుమూత   •   బాలికల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ   •   తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే: చంద్రశేఖర్ తివారి   •   ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   •   దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...   •   దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు   •   ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం   •   వర్షంలోనూ పారిశుధ్య పనుల్లో ఉపసర్పంచ్   •   ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషం   •  

అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది

21-07-2026 07:09 PM

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాద్,(విజయక్రాంతి): నూతన వంతెన నిర్మాణంతో నిజామాబాద్ రూరల్ - పట్టణం మధ్య దూరాభారం తగ్గుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మంగళవారం నగరంలోని అమ్మ వెంచర్ సమీపంలో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నగరంలోని 4వ డివిజన్ నుంచి 22వ డివిజన్ లోకి వెళ్లేందుకు బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ప్రధానంగా విద్యాలయాలను, మార్కెట్ కు, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారికి దూరభారం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మేయర్ ఉమారాణి, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, స్థానిక కార్పొరేటర్ వైష్ణవి సుధా, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.