సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం
21-07-2026 06:57 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపు మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటి బిజెపి ఆధ్వర్యంలో బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమములో భాగంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూత్ ల బిఎల్ఎ-2ల సమావేశము నిర్వహించడం జరిగింది. ఈసమావేశానికి మున్సిపాలిటీ ఇన్చార్జి జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్ మరియు బి ఎల్ ఎ-1 బెజ్జంకి దిలీప్ కుమార్ పాల్గొన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూత్ లలో ఎలెక్ట్ చేసిన బి ఎల్ ఎ -2 లు చేయవలసిన విధి నిర్వహణ చేయవలసిన కార్యక్రమాలను వివరించడం జరిగింది.






