21 July, 2026 | 9:31 PM

Breaking News

ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని

21-07-2026 06:54 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ సిటీ ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌ షాప్, హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ఫోటో,వీడియోగ్రాఫర్లు సమాజంలోని మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఇటువంటి వర్క్‌షాప్‌లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫోటో, వీడియో గ్రాఫర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.