23-02-2026 12:08:52 AM
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్‌పూర్, ఫిబ్రవరి 22: అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఆదివారం పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన సంస్కరణలలో భాగంగా ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీ జిహెచ్‌ఎంసిలో విలీనం కావడం జరిగిందని తెలిపారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వెంటనే నిధులు కేటాయించాలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామ ని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన జనాలు అందించేం దుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కృష్ణ, ఉపేందర్ రెడ్డి, గోపాల్, తలారి రాములు, అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
నూతన ఆలయాలకు భూమి పూజ....అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శివ పంచాయతం రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణాలకు ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన భూమి పూజలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందించేందుకు నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, జిన్నారం మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, నగేష్, శ్రీకాంత్, ఉపేందర్, కృష్ణ, రాములు, గోపాల్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.