23-02-2026 12:08:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ చట్టాలను అధికారులు పటష్టంగా అమలు చేస్తుంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ పరిధిలో మున్సిపల్ చట్టాలను తుంగలోకి తొక్కి అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు పాల్వంచ 37వ డివిజన్లో ఓ అపార్ట్మెంట్ కు ఈశాన్యంలో ఉన్న
రహదారిని గత కొంత కాలంగా ఆక్రమించి మూసివేసి రాకపోకలు నిలిపి వేసిన, ప్రజలు ఇబ్బంది పడుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. టిటిడి కళ్యాణ మండపం వైపు వెళ్ళు రహదారిలో ఉన్నదాదాపు 15 అడుగుల వెడల్పు ఉన్న డ్రైనేజీని ఓ ప్రముఖ వ్యాపారి ఆక్రమించి అక్రమ నిర్మాణం. చేపట్టారు. నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ పాలకవర్గం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా, ఇలాంటి వాటిపై మమ అనిపిస్తారా వేచి చూద్దాం?