calender_icon.png 23 February, 2026 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవాణా భత్యం వచ్చిందోచ్..

23-02-2026 12:10:21 AM

పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు మంజూ*ు

నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోన* జమ

సంగారెడ్డి జిల్లాకు రూ.7.98 లక్షల భత్యం విడుదల

సంగారెడ్డి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దూర ప్రాంత విద్యార్థులకు రవాణా భత్యాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష తాజాగా విడుదల చేసింది. 10 నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి నెలకు రూ.600 చొప్పున నిధులు మంజూరు చేసింది. 2025-26కు విద్యా సంవత్సరం జూన్ నుంచి మార్చి వరకు మొత్తం పది నెలల రవాణా, ఎస్కార్ట్ నిధులు విడుదలయ్యాయి.

పాఠశాలలు లేని మారుమూల ఆవాసాల నుంచి తమకు అందుబాటులో ఉన్న పాఠశాలలకు నిత్యం హాజరయ్యే విద్యార్థులకు రవాణా భత్యం నిధులు ఈ ఏడాది ఒకేసారిగా విడుదల చేయడంతో ఉపయోగకరంగా మారనుంది. నేరుగా బదిలీ (డీబీటీ) ద్వారా విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. ఆవాసాల సమీపంలో పాఠశాల లేక ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటర్, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల వరకు, ఉన్నత పాఠశాలలకు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లే విద్యార్థులు ప్రయాణ భత్యాన్ని పొందేందుకు అర్హులు. ఒక విద్యార్థికి ఏడాదికి రూ.6వేల చొప్పున రవాణా చార్జీలు చెల్లిస్తారు. ఒకేసారి రూ.6 వేలు రానుం

ప్రశాంతంగా ముగిసిన గురుకుల పరీక్ష !

నాగల్ గిద్ద, ఫిబ్రవరి 22: నాగల్ గిద్ద మండలంలోని కరస్ గుత్తి గిరిజన గురుకులలో ఆదివారం నిర్వహించిన గురుకుల పాఠశాలలో  5వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో ఉచిత విద్య, వసతి, ఆంగ్ల మాధ్యమంలో బోధనతో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు. అందుకోసం పరీక్షలకు ఏటా పోటీ పెరుగుతుంది. గురుకుల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు.