calender_icon.png 22 February, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

22-02-2026 12:54:47 AM

  1. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

టీజీఎస్‌ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): టీజీఎస్‌ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 330/2016 జనరల్ సెక్రటరీ హరికిషన్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర కమిటీ సభ్యులు టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నని ఆయన కార్యాల యం లో కలిసి ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకె ళ్లారు.

ఆర్టీసీలో మెజారిటీ కార్మికులుగా దాదాపు 20 వేల మంది బీసీ ఉద్యోగులు ఉన్నందున సమస్యల ప్రభావం వారిపై ఎక్కువగా పడుతున్నదన్నారు. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ జీవోలు ఉన్నప్పటికి సంఘానికి గ్రీవేన్స్ మీటింగ్స్ ఇవ్వట్లేదని తెలిపారు తమ సంఘానికి రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉంటూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరించవలసిందిగా హరికిషన్ తీన్మార్ మల్లన్నకు విజ్ఞప్తి చేశారు.

అందుకు తీన్మార్ మల్లన్న అంగీకరిస్తూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, అలాగే బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడ తన వంతు సహాయాన్ని అంది స్తానని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సంపత్ ముదిరాజ్‌ని(రాణిగంజ్ డిపో)  ఎన్నుకున్నారు. త్వరలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర, జోనల్, రీజనల్, డిపో కమిటీలను ఎన్నుకొని హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిం చడంతో పాటు వీసీ అండ్ ఎండీని కలిసి ఆర్టీసీ కార్మికుల, బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరికిషన్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ చైర్మెన్ గుండ్ల ఆంజనేయులు గౌడ్, అద్యక్షులు సంపత్ ముదిరాజ్‌లతో పాటు రాష్ట్ర నాయకులు రాములు గౌడ్, రామేశ్వరం, పాండు యాదవ్, ఆంజనేయులు, నగేష్, పాండు తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్పీలో చేరికలు..

ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ నుంచి పలువురు సీపీఐ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)లో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యద ర్శి కోట్ల వాసుదేవ్  ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం, సామా జిక న్యాయం సాధన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కొత్తగా చేరిన నాయకులు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు తమను ఆకర్షించాయని, నాగోల్ డివిజన్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేస్తామ ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నరసయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.