1 May, 2026 | 3:32 AM

జిల్లాలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి

01-05-2026 02:12 AM

అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు

ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ అధ్యయనం గొప్ప అనుభవం

విద్యాశాఖ రాష్ట్రస్థాయి వీసీలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల టౌన్, ఏప్రిల్ 30 : అక్షరాస్యత పరంగా వెనుకబడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే విద్య వారోత్సవాలు, తదితర అంశాలపై గురువారం హైదరాబాదు నుంచి విద్యాశాఖ రాష్ట్ర కార్యదర్శి యోగితా రానా సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

అనంతరం గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పించేందుకు సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నా మన్నారు.

విద్యాశాఖ అధికారులతో కలిసి ఇటీవల తాను ఫిన్లాండ్ వెళ్లిన అనుభవాలను కలెక్టర్ తెలియజేశారు. ఫిన్లాండ్ దేశంలో ఐదు రోజులపాటు వివిధ విద్యాసంస్థలను సందర్శించా మన్నారు. ఈ సమావేశంలో డిఇఓ విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారి మైఖేల్, టిజి ఈడబ్ల్యూఐడిసి ఏఈలు మోహన్ రెడ్డి, ఆజాం, తదితరులు పాల్గొన్నారు.