కొత్త చెరువు మత్తడి మరమ్మతులకు కృషి
17-07-2026 09:26 PM
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం పర్సనంభాల గ్రామంలోని కొత్త చెరువు మత్తడి మరమ్మతుల కోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మత్తడి మరమ్మతులు పూర్తైతే సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సాయి, తదితరులు పాల్గొన్నారు.






