'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్
17-07-2026 09:02 PM
- ముగ్గురికి 10 రోజులు జైలు శిక్ష
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 55 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీహెచ్ ముత్యంరాజు తెలిపారు. వారిని శుక్రవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు పేర్కొన్నారు. వారిలో 51 మందికి రూ.5లక్షల 62 వేలు జరిమానా, ముగ్గురికి 10 రోజులు, ఒకరికి 5 రోజులు జైలు శిక్ష విధించారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 28 మందికి ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రూ.లక్షా 40 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు.






