పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్
ఎల్లారెడ్డి,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి సొసైటీ పిఎసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిచారు. ఇటీవల కోర్టు తీర్పు వెలువరించిన సందర్భంగా చైర్మన్ లను డైరెక్టర్లను కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసి వారికి కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ప్రమాణ స్వీకారం చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో చైర్మన్ గా యోగుల నర్సింలు, వైస్ చైర్మన్ గా ప్రశాంత్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్ లు బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యాన్ని సేకరించి వారికి సహకరించాలని కోరారు. ఎగుమతులు దిగుమతులు త్వరగా కావాలని వర్షాల వల్ల ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని కాబట్టి ఎక్కువ లారీలు పంపాలని ప్రభుత్వాన్ని కోరారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మతమాల ప్రశాంత్ గౌడ్ డైరెక్టర్లు సూర్య ప్రకాష్ బాలరాజు లక్ష్మణ్ సుఖేందర్ రెడ్డి శ్రీమతి శ్రీ సత్యవ్వ గోపికృష్ణ నారాయణ నర్సింలు అగ్రికల్చర్ ముఖిద్ సొసైటీ సెక్రెటరీ విశ్వనాథం సొసైటీ మాజీ అధ్యక్షులు సాయ గౌడ్ రైతులు సిబ్బంది పాల్గొన్నారు.






