21 March, 2026 | 5:13 AM

ఈద్ -ఉల్ -ఫితర్ నేడు

21-03-2026 12:16 AM

నగరంలో రంజాన్ సంబురం

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతన, క్రమ శిక్షణ, దానగుణాల కలయికతో సాగిన పవిత్ర రంజాన్ మాసం.. నెలవంక దర్శనం కావడంతో ముస్లింలు శనివారం ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగను జరుపుకుంటారు. నెల రోజుల పాటు రోజా పాటించిన భక్తులు, శనివారం కొత్త వస్త్రాలు ధరించి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.

నగరంలోని మసీ దులు, ఈద్గాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈద్గాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు.