30 June, 2026 | 7:55 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

చర్లపల్లి హెచ్పీసీఎల్ వద్ద ఇంధన కొరత

21-03-2026 12:17 AM

కిలోమీటర్ల మేర వాహనాల క్యూ, డ్రైవర్ల ఆవేదన

కుషాయిగూడ మార్చి 20 (విజయ క్రాంతి) : హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి ప్రాంతంలో ఇంధన కొరత తీవ్ర ఆందోళన కు దారితీసింది. హెచ్పీసీఎల్, హెచ్పి గ్యాస్, భారత్ పెట్రోలియం కేంద్రాల వద్ద గత మూడ్రోజులుగా వాహనాలు కిలోమీటర్ల పొడవునా బారులు తీరాయి. ట్యాంకర్లు, లోడింగ్ వాహనాలు ప్రధాన రహదారులపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంధన సరఫరాలో మార్పుల కారణంగా, ముందుగా ఉన్న క్రెడిట్ విధా నం నిలిపివేసినట్లు యాజమాన్యం స్పష్టం చేసిం ది.

క్రెడిట్ ఉంటేనే పెట్రోల్, గ్యాస్ అందిస్తామని, లేకపోతే సరఫరా ఉండదని తెలిపింది. దీంతో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులు రోజుల తరబడి కేంద్రాల వద్దే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మల్లాపూర్ నుంచి చర్లపల్లి వరకు ప్రధాన రహదారిపై ట్యాంకర్లు క్యూలుగా నిలిచిపోవడం గమనార్హం. కొంతమంది బంక్ యజమానులు చెల్లింపులు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.  ఈ పరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరా కూడా దెబ్బతింది.

గ్యాస్ బుకింగ్లు నిలిచిపోవడంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. కొందరు మళ్లీ కట్టెల పొయ్యిలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, కొరతను ఆసరాగా చేసుకుని కొన్ని పెట్రోల్ బంక్ యజమానులు అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రజలకు గ్యాస్ పెట్రోల్ డీజి ల్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల  కమిటీ వ్యవ స్థాపక కన్వీనర్ ప్రపుల్ తుమ్మల రామ్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇప్పటికే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో పన్నుల భారంతో ప్రజల బతుకులు అవుతున్నాయన్నారు.