రంజాన్ తోఫా కిట్ల పంపిణీ
మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్
పెబ్బేరు మార్చి 20: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం సోదరులు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ‘రంజాన్ తోఫా’ కిట్లను శుక్రవారం 9వ వార్డు లబ్ధిదారులకు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని మతాల పండుగలను గౌరవించడం, పేదలకు అండగా నిలవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు క్రమశిక్షణతో విజయవంతంగా కొనసాగాలని, పట్టణ ప్రజలందరికీ అల్లాహ్ ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.అనంతరం లబ్ధిదారులు ప్రభుత్వం మరియు మున్సిపల్ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ గౌడ్, బాలరాజు, బండమీది నరసింహ, అసాద్, కురుమూర్తి, షకీల్ తదితరులు పాల్గొన్నారు.




