10 April, 2026 | 12:04 PM

ఎనిమిది మంది ఉగ్రవాదులు హతం

18-02-2026 01:30 PM

కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్(Balochistan) ప్రావిన్స్‌లోని క్వెట్టా శివార్లలో బుధవారం పాకిస్తాన్ భద్రతా దళాలు కనీసం ఎనిమిది మంది అనుమానిత ఉగ్రవాదులను హతమార్చాయి. క్వెట్టా శివార్లలోని దరాక్షన్ పట్టణం సమీపంలో నిఘా సమాచారం ఆధారంగా సీటీడీ దాడి చేసిందని, ఇందులో ఉగ్రవాదులు మరణించారని బలూచిస్తాన్ ఉగ్రవాద నిరోధక విభాగం (CTD) ప్రతినిధి మీడియాకు తెలిపారు. సీటీడీ అధికారులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన ప్రదేశంలో ఎనిమిది మృతదేహాలు లభ్యమైనట్లు ప్రతినిధి తెలిపారు.