18-02-2026 01:25:01 PM
హైదరాబాద్: మూసీ పేరిట సీఎం అరాచకం సృష్టించారని బీఆర్ఎస్ విప్ వివేక్(BRS Whip Vivek) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. మూసీకి సంబంధించి పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ నగరం గురించి ఏ మంత్రికి అవగాహన లేదని వెల్లడించారు. హైడ్రా అని పేరు పెట్టి హైడ్రామాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. మెట్రో పనులు నత్తనడకన నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమైనట్లు అర్థమైందన్నారు. అటు మున్సిపల్ శాఖ మంత్రిగా, ఇటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను విస్మరించి కేవలం తన రాజకీయాల కోసం పబ్బం గడుపుతున్నట్లు ఉందని చెప్పారు.