13-01-2026 11:41:27 PM
హనుమకొండ,(విజయక్రాంతి): బాలసముద్రంలోని ఏకశిల పార్కు వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పడాల సోమయ్య, ఈసీ మెంబర్లుగా కుందారపు అరుణ, పట్నంశెట్టి సుమతి ఎన్నుకోగా మిగతా పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా బోనాల వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా చెన్నం రవీందర్రెడ్డి, కోశాధికారిగా బిల్లా రాజిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా దేశిని సిద్ధార్థ గౌడ్ ఎన్నుకున్నారు. మొత్తం 725 సభ్యులకు 600 మంది సభ్యులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించు కున్నట్లు ఎన్నికల అధికారి లెక్కల జలేందర్ రెడ్డి తెలిపారు. గెలుపొందిన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షు డిగా వంగా రాజిరెడ్డి, ప్రధాన సలహాదారుడిగా పచ్చిమట్ల ఎల్లగౌడ్ నియమించినట్లు తెలిపారు. ఈసందర్భంగా అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ రెండు సంవత్సరాల తమ పదవికాలంలో పార్కు అభివృద్ధికి, అసొసియేషన్ సభ్యుల సంక్షేమానికి, సామాజిక కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.