14-01-2026 12:00:00 AM
ఇల్లందు మున్సిపల్ రాజకీయాల్లో ఉత్కంఠ
వెంకట్ గౌడ్ నిర్ణయంపై పట్టణంలో ఉత్కంఠ
ఇల్లెందు/ఇల్లెందుటౌన్, జనవరి 13(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇల్లందు రాజకీయ పరిమాణాలు వే గంగా మారుతున్నాయి. రోజుకో కొత్త సమీకరణం, గంటగంటకూ మారుతున్న రాజకీయ పరిస్థితులతో పట్టణ రాజకీయా లు ఉత్కంఠభరితంగా మారాయి. ఈ పరిణామాల మధ్య ప ట్టణ రాజకీయాలపై ఒక్కసారిగా దృష్టిని కేంద్రీకరించే స్థాయికి చేరుకున్న పేరు మాజీ వైస్త్చ్రర్మన్ మడత వెంకట్ గౌడ్. ఇ ల్లందు రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆయన, చిన్నా, పెద్దా, ముసలి, ముతక అన్న తేడా లే కుండా ప్రజల మధ్య బలమైన ముద్ర వేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
రాజకీయ అనుభవం, ప్రజాక్షేత్రంతో ఉన్న ప్రత్యక్ష అనుబంధం, సామాజిక వర్గాల మధ్య ఏర్పరుచుకున్న విశ్వాసమే ఈ ఎన్నికల వేళ ఆయనను కేంద్ర బిం దువుగా మార్చింది. ఈ నేపథ్యంలో మడత వెంకట్ గౌడ్ తీసుకునే ఒక్క నిర్ణయం ఇల్లందు మున్సిపల్ రాజకీయాలను పూర్తి గా కొత్త దిశగా మలిచే శక్తి కలిగి ఉందన్న అభిప్రాయం పట్టణమంతా వ్యక్తమవుతోంది. తాజాగా మున్సిపల్ 24 వార్డుల ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల కాగా, చైర్మన్ పదవి రిజర్వేషన్ల ప్రకటన పూర్తయ్యే లోపే ఆయన తీ సుకునే నిర్ణయం పట్టణ రాజకీయ సమీకరణాలను ప్రభావి తం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
సొంత ప్యానల్తో పోటీ ఫలితాలు
అనుకూలం కాలేదు
గత మున్సిపల్ ఎన్నికల్లో సొంత ప్యానల్తో బరిలోకి దిగిన మడత వెంకట్ గౌడ్కు ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రాలేదు. అయినప్పటికీ, ఆ ఎన్నికల అనంతరం కూడా పట్టణ రాజకీయాల్లో ఆయన ప్రభావం తగ్గలేదన్న అభిప్రాయం ఉంది.
మాజీ వైస్త్చ్రర్మన్గా అభివృద్ధి ముద్ర
మడత వెంకట్ గౌడ్ గతంలో ఇల్లందు మున్సిపాలిటీలో మాజీ వైస్త్చ్రర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ పట్టణ అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా నిలిచారు. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పోషించిన పాత్రకు అప్పట్లో విస్తృత గుర్తింపు లభించిందని స్థానిక వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా కీలక పాత్ర
ప్రస్తుతం బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా కొనసాగుతున్న వెంకట్ గౌడ్, బీసీ వర్గాల హక్కులు, సమస్యలపై నిరంతరం పోరాడుతూ తన రాజకీయ ప్రాధాన్యతను మరింత బలపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల నుంచి ఆయనకు లభిస్తున్న మద్దతు రోజురోజుకు పెరుగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
జనరల్ లేదా బీసీ రిజర్వేషన్ వస్తే
బరిలో వెంకట్ గౌడ్..
మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ లేదా బీసీ రిజర్వేషన్ గా ఖరారైతే మడత వెంకట్ గౌడ్ స్వయంగా పోటీలో నిలిచే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మాజీ వైస్త్చ్రర్మన్ గా అనుభవం, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్న సామాజిక బలం ఈ ఎన్నికల్లో తనకు అనుకూలంగా మారుతుందన్న విశ్వాసంతో నే ఆయన ఈ నిర్ణయానికి సిద్ధమవుతున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
పార్టీ మార్పుపై జోరుగా చర్చలు..
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వెంకట్ గౌడ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? లేక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వైపు అడుగులు వేస్తారా? అన్న అంశంపై పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా రిజర్వేషన్ల ఖరారు పైనే ఆయన తుది నిర్ణయం ఆధారపడి ఉండనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
రిజర్వేషన్ ఆధారంగా ప్రత్యామ్నాయ వ్యూహం
ఒకవేళ చైర్మన్ పదవి ఎస్సీ లేదా ఎస్టీ రిజర్వేషన్గా ప్రకటిస్తే, తాను ప్రత్యక్షంగా పోటీ చేయకుండా తన అనుచర వర్గానికి అవకాశం కల్పించి తెర వెనుక నుంచి రాజకీయాలను నడిపించే ‘కింగ్మేకర్’ పాత్రలో కొనసాగాలన్న వ్యూహంపై ఆయన ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం వినిపిస్తోంది.
అభివృద్ధి + సామాజిక బలం = ‘వెంకట్ గౌడ్ ఫ్యాక్టర్
మాజీ వైస్త్చ్రర్మన్గా అభివృద్ధి అనుభవం, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా సామాజిక వర్గాల మధ్య ఏర్పరుచుకున్న బలమైన పట్టు. ఈ రెండింటి సమ్మేళనమే ఈ ఎన్నికల్లో ‘వెంకట్ గౌడ్ ఫ్యాక్టర్’ గా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ ఏదైనా, పోటీ పద్ధతి ఏదైనా, ఆయన తీసుకునే ఒక్క నిర్ణయం మాత్రం ఇల్లందు మున్సిపల్ రాజకీయాలను కొత్త దిశగా మలిచే శక్తి కలిగి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.