14-01-2026 12:00:00 AM
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
మేడారంలో మరో 200 సంవత్సరాలు నిలిచేలా రాతి నిర్మాణాలతో అభివృద్ధి పనులు
అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం,జనవరి 13 (విజయక్రాంతి): ప్రజల జీవన ప్రమాణాలను మె రుగు పరచడమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను రెండు కళ్లలా భావిస్తూ ప్రజా ప్రభుత్వం సమన్వయంతో అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారపౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ లతో కలిసి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సంద ర్భంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి నిధుల ద్వారా రూ.1 కో టి 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ మార్కెట్ భవనం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నగరాభివృద్ధి నిధుల ద్వారా రూ.7 కోట్ల వ్యయంతో మంజూరైన అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయ భవన నిర్మా ణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం దమ్మపేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తూ, ఎన్నికల సమయం లో ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో అమలు చేస్తోందన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తూ ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు.సమ్మక్కసారలమ్మ మహా జాతర ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇది ఆదివాసీల అతిపెద్ద ఆధ్యాత్మిక జాతరగా మాత్రమే కాకుండా, దేశవ్యా ప్తంగా కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారానికి తరలివచ్చే మహోత్సవమని పేర్కొన్నారు. ముఖ్యమం త్రి ఆలోచనలకు అనుగుణంగా, కాకతీ యుల కాలం నాటి నిర్మాణ శైలిని తలపించేలా రాతి నిర్మాణ పద్ధతిలో మరో 200 సంవత్సరాలు నిలిచే విధంగా మేడారం సమ్మక్కసారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
ఈ నెల 18 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు రానున్నారని, 19 న మేడారం పునరుద్ధరణ, అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గత రెండు సంవత్సరాల కాలంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని మంత్రి తెలిపా రు. దాని ఫలితంగానే ఇటీవల జరిగిన పం చాయతీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా సుమా రు 70 శాతం స్థానాల్లో ప్రజలు ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఇదే విశ్వాసంతో రానున్న ఎన్నికలలో కూడా ప్రజలు ప్రజా ప్రభుత్వానికే మద్దతు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.