2 August, 2026 | 7:42 PM

గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

03-09-2025 12:00 AM

నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి)/ కల్వకుర్తి రూరల్: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ జిల్లా వినాయక భక్త బృందానికి పలు సూచనలు చేశారు.

పట్టణంలోని శ్రీపురం రోడ్డు గుండా నాగనూరు చెరువులో నిమర్జనం చేసేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్ విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిమర్జనం ప్రాంతాన్ని ఎస్పీ పర్యవేక్షించారు. కల్వకుర్తి పట్టణంలోని ఎర్రకుంట చెరువు వద్ద నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు పరిశీలించారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలను పూర్తి చేసుకోవాలని సూచించారు.