2 August, 2026 | 6:42 PM

పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలి

03-09-2025 12:00 AM
  1. ఏజెన్సీ సిస్టంను రద్దు చేసి నేరుగా వారి ఖాతాలోనే నగదు జమ చేయాలి
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య 

ఖైరతాబాద్; సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండిం గ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని బీసీ సంక్షే మ సంఘం కార్యదర్శి గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ ఔట్సో ర్సింగ్ ఎంప్లాయిస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. సమాన పనికి సమాన వేత నం చెల్లించాలని అన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే జీతాలను నెలనెలా సక్రమంగా చెల్లించాలన్నారు. అదేవి ధంగా 10 సంవత్సరాల పైగా అనుభవం కలిగిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీ గా పర్మినెంట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అవినీతికి పాల్పడుతున్నాయని, ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే డైరెక్టుగా ఉద్యోగుల ఖాతా లో జీతాలు జమ చేయాలని సూచించారు. మధ్య, పేద తరగతి విద్యార్థులకు ఉన్నతమైన చదువులు అందించాలని మహోన్నతమైన ఉద్దేశంతో ప్రారంభించిన మోడల్ స్కూల్స్ వసతులు, ఉపాధ్యాయులు సరిగా లేక దయనీయమైన స్థితిలో ఉన్నాయన్నారు.

నిర్వ హణను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని దీని కి సీఎం బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందగోపాల్, రామకృష్ణ, నిఖిల్, రవి, యాదగిరి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.