01-10-2025 01:24:07 AM
సభలు, సమావేశాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్30( విజయక్రాంతి): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కేటాయించిన విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహిం చాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవ న సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎస్. పి. కాంతిలాల్ సుభాష్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక సంస్థలు సర్పంచ్, వార్డు, ఎం పి టి సి, జెడ్ పి టి సి స్థానాల ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, తహసిల్దార్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, నాయబ్ తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, నగదు, అక్రమ మద్యం, చీరల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రవర్తన నియమావళి అమలులో ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగించాలని, ప్రతి మండలానికి నాయబ్ తహసిల్దార్, పోలీస్ అధికారి, వీడియో గ్రాఫర్లతో బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని తెలిపారు.
3 స్టాటిస్టిక్స్ సర్వేయర్లెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని, ఎన్నికల విధుల లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సెలవులు మినహాయింపు లేదని తెలిపారు. అక్టోబర్ 9వ తేదీ నుండి నవంబర్ 11వ తేదీ వరకు జిల్లాలు ఎన్నికల ప్రక్రియ నామినేషన్ నుండి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి అధికారి తమకు కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సభలు, సమావేశాలు అనుమతులపై పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
సిబ్బందికి అవసరమైన శిక్షణ
బ్యాలెట్ బాక్సులకు ఏమైనా మరమ్మతులు ఉంటే త్వరగా పూర్తిచేసి ఎన్నికలలో వినియోగించేందుకు సిద్ధం చేయాలని, ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి అవసర మైన శిక్షణ అందించాలని, ఎన్నికల సమాచారాన్ని నిర్ణీత నమూనా లలో ఆలస్యం చేయకుండా సమర్పించాలని తెలిపారు. ఎం పిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు 2 విడతలలో, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు 3 విడతలలో నిర్వహించడం జరుగుతుందని తెలి పారు.
నామినేషన్ స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాలలో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిర్వహణలో సిబ్బందిని తరలించేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని, పత్రికలలో, ప్రచార సాధనాలలో జరిగే ప్రచారంపై ప్రత్యేక నిఘా నిర్వహించాలని తెలిపారు. నోడల్ అధికారులకు కేటాయించిన విధులను ఆలస్యం జర గకుండా నిర్వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని తెలిపారు.
ఈ కార్యక్ర మంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహ ణ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా గ్రామీణ అభి వృద్ధి అధికారి దత్తారాం, జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్ కుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నదీ మ్, ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.