01-10-2025 01:26:46 AM
కరీంనగర్, సెప్టెంబరు 30 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రం లోని రాంనగర్ లోగల మార్క్ ఫెడ్ మైదానం లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా దసరా రోజున నిర్వహించే రాంలీలా కారక్రమాన్ని నిర్వహించకుండా మార్క్ ఫెడ్ గేట్ కు తాళం వేయడాన్ని నిరసిస్తూ.. BRS పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరి శంకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు గేట్ ఎదురుగా ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.
రాంలీలా కార్యక్రమాన్ని రాజకీయం చేస్తే ఊరుకోం: సుడా చైర్మన్‌రామ్ లీలా కార్యక్రమాన్ని రాజకీయం చేస్తామంటే ఊరుకోమ ని సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.
విగ్ర హం ఏర్పాటు విషయంలో మార్క్ ఫెడ్ అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదని గే టుకు తాళం వేశారని అన్నారు. ఈ విషయం లో కాంగ్రెస్ పార్టీ నాయకులను బాద్యులను చేయడమేమిటని ప్రశ్నించారు.అందరం కలి సి ప్రోటోకాల్ పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, బిఆర్‌ఎస్ నాయకు లు రాద్ధాంతం చేయడం మాని సహకరించాలని నరేందర్ రెడ్డి కోరారు.