18 July, 2026 | 12:04 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

ఎన్నిక యుద్ధం కాదు.. ప్రతిపక్షం ప్రత్యర్థి కాదు

12-06-2024 12:45 AM

ప్రభుత్వాలు ప్రజాసంక్షేమంపై దృష్టి సారించాలి

మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలి

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ముంబై, జూన్ 11: ఎన్నికలను యుద్ధంలా  భావించాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షం ఎప్పటికీ ప్రత్యర్థి, విరోధి కాబోదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సంఘ్ కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికార పక్షం ఒకవైపు వాస్తవాన్ని వెల్లడిస్తే, ప్రతిపక్షం మరోవైపు ఉన్న కోణాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

దేశం ఆర్థిక, భద్రత, సైనిక, క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించిందనే విషయం వాస్తవమైనప్పటికీ, వాటి ప్రతిపాదికన అభివృద్ధి జరిగిందని చెప్పలేమని అభి ప్రాయపడ్డారు. ఎన్నికల ముగిసినందున ఇకపై ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం గురిం చి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశం ప్రస్తుతం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నదని, వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. గతేడాది మణిపూర్‌లో చేలరేగిన హింసాకాండ పునరావృతం కాకుండా చూడాలని సూచించా రు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రతి ‘సంఘ్ సేవక్’ సభ్యుడు తాను చేస్తున్న పనిని పవిత్రమైనదిగా భావించాలన్నారు. ప్రవర్తన, మాట తీరులో ఏమాత్రం అహంకారం కనిపించకూడదన్నారు.